మహానటి ఓవర్సీస్ రివ్యూ…కల్ట్ క్లాసిక్…కాచుకోండి!

0
909

           కొన్ని సినిమాల పై రిలీజ్ కి ముందు నుండి మంచి ఆసక్తి ఉంటుంది, కొన్ని సినిమాల పై రిలీజ్ కి ముందు నుండి మంచి పాజిటివ్ బజ్ ఉంటుంది, ప్రస్తుతం ఈ రెండు ఉన్న సినిమాల జాబితాలో చేరే అతి కొద్ది సినిమాలలో “మహానటి” ఒకటి అని చెప్పాలి. కొన్ని గంటల్లో రెగ్యులర్ షోలు జరగబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

సినిమా కథ సింపుల్ గా ఒక స్త్రీ గా మొదలై మహానటిగా ఎదిగే సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన కథ అని చెప్పొచ్చు. సావిత్రి గా కీర్తి సురేష్ నటించింది అనేకన్నా జీవించేసింది అని చెప్పాలి. కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలోనే లైఫ్ టైం రోల్ దొరికింది.

ఆ రోల్ లో జీవించి నటించింది కీర్తి సురేష్…ప్రతీ ఫ్రేం లో సావిత్రిలాగే కనిపిస్తూ అద్బుతమైన స్క్రీన్ ప్రజెన్స్ తో దుమ్ము లేపింది అని అంటున్నారు. ఇక తర్వాత దుల్కర్ సల్మాన్ కూడా జెమినీ గణేషన్ రోల్ లో జీవించి నటించి మెప్పించాడు అంటున్నారు.

ఇక సమంత మరియు విజయ్ దేవరకొండ లు కనిపించేది తక్కువ సమయమే అయినా తమ మార్క్ నటనతో మెప్పిస్తారని అంటున్నారు. ఇక చిన్న రోల్స్ లో భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమా లో కనిపిస్తుందని, మరి కొన్ని స్పెషల్ అప్పీయరెన్స్ లు షాక్ కి గురి చేస్తాయని అంటున్నారు.

ఓవరాల్ గా కథ జీవిత చరిత్ర అయినా కానీ కథనం స్పీడ్ గా ఉంటే కొన్ని సార్లు కిక్ పోతుంది. అందుకే ఈ సినిమా విషయంలో స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది…కల్ట్ క్లాసిక్ చూస్తున్న ఫీలింగ్ ని అడుగడుగునా కల్గిస్తుందట ఈ సినిమా. దర్శకుడు నాగ అన్వేష్….

అద్బుతమైన టేకింగ్ తో దుమ్ము లేపాడని అంటున్నారు. మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేమ్ వరకు తన మార్క్ కనిపించేలా కష్టపడ్డాడు అంటున్నారు. సాంకేతిక నిపుణులు కూడా తమ శక్తిమేర ఈ క్లాసిక్ ను ఆ ఫీలింగ్ లోనే ఉంచేలా కష్టపడ్డారు అంటున్నారు.

మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఎబో యావరేజ్ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్బుతంగా ఉందని అంటున్నారు. ఇక కొంతకాలంగా నిర్మాణంకి దూరంగా ఉన్న వైజయంతి మూవీస్ అల్టిమేట్ కంబ్యాక్ చేసే మూవీ అని అంటుండటం విశేషం.

మొత్తం మీద సినిమా అనేక ప్లస్ లు ఉన్నా, లెంత్ ఎక్కువ ఉండటం, కథనం స్లో గా ఉండటం కొంతమందికి నచ్చకపోవచ్చు అంటున్నారు. అది తప్పితే సినిమా ఆద్యంతం ఓ కల్ట్ క్లాసిక్ మూవీ ని చూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తుంది అంటున్నారు.

ఓవర్సీస్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న మహానటి ఇప్పుడు రెగ్యులర్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక్కడ ఆడియన్స్ ని కూడా సినిమా ఇదే రేంజ్ లో మెప్పిస్తే అద్బుతాలు సృష్టించడం ఖాయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here