మహానుభావుడు ఫస్ట్ డే కలెక్షన్స్…రచ్చ రచ్చే

2016 నుండి పండగలను టార్గెట్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న యంగ్ హీరో శర్వానంద్… ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి బాక్ టు బాక్ పండగ సూపర్ హిట్ల తర్వాత మొదటి సారిగా దసరా ను టార్గెట్ చేసి రిలీజ్ చేసిన సినిమా మహానుభావుడు. బాక్స్ అఫీస్ దగ్గర ఎన్టీఆర్ మరియు మహేష్ లాంటి టాప్ స్టార్స్ ఉన్నా ఏమాత్రం బెదరకుండా తన సినిమాను రిలీజ్ చేసి హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ విషయంలో దుమ్ము రేపాడు.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.6 కోట్ల షేర్ ని వసూల్ చేసిన మహానుభావుడు కర్ణాటకలో 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలు, టోటల్ ఓవర్సీస్ లో 50 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దాంతో సినిమా మొత్తం గా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 3.7 కోట్ల షేర్ తో శర్వానంద్ కెరీర్ లో శతమానంభవతి 3.8 కోట్ల తర్వాత సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. మూడు రోజుల దసరా వీకెండ్ హాలిడేస్ లో ఈ సినిమా 10 నుండి 12 కోట్ల వరకు షేర్ ని రాబట్టే చాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment