మహేష్ ఫస్ట్…ఎన్టీఆర్ సెకెండ్…ఇది ఫైనల్ కానీ!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియాలో హీరోల పుట్టినరోజు వేడుకలని అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు..కాగా మొదటగా అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఏకంగా అజిత్ పుట్టిన రోజున 1.3 మిలియన్ ట్వీట్స్ తో దుమ్ము రేపారు.

ఇది టాప్ లో ఉండగా ఇప్పుడు మహేష్ పుట్టినరోజున మహేష్ ఫ్యాన్స్ ఏకంగా 1.31 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పి టాప్ ప్లేస్ ని దక్కించుకోగా ఒక్క టాలీవుడ్ నే తీసుకుంటే మహేష్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ 0.83 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ ని దక్కించుకుంది.

ఇక మూడో ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గత ఏడాది పుట్టినరోజు వేడుకల్లో 5 లక్షల 65 వేల ట్వీట్స్ తో రికార్డ్ సృష్టించగా ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు 3 లక్షల 60 వేల ట్వీట్స్ తో 4 వ ప్లేస్ లో నిలిచారు..ఇవి ఇప్పటివరకు టాలీవుడ్ రికార్డ్ కాగా ఇవి ఫైనల్ అయ్యే చాన్స్ తక్కువే అని చెప్పాలి…త్వరలోనే మెగాస్టార్ పుట్టినరోజు మరియు పవర్ స్టార్ పుట్టినరోజు ఉండటంతో ఈ రికార్డులు మారే చాన్స్ ఉంది…మరి ఏం జరుగుతుందో చూడాలి..

Leave a Comment