మళ్ళీ బాహుబలి అవుట్…సూపర్ స్టారా…మజాకా!!

0
582

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే… అత్యంత భారీ అంచనాల నడుమ వస్తున్నా ఈ సినిమా 20 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా రిలీజ్ విషయం లో ఇప్పటి నుండే అద్బుతాలు సృష్టిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకనే చెబుతుంది.

సినిమా ఉనైటెడ్ కింగ్ డం లో టాలీవుడ్ సినిమాల తరుపున ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. అక్కడ ఇది వరకు బాహుబలి 2 22 లోకేషన్స్ లో అలాగే అజ్ఞాతవాసి 20 లోకేషన్స్ లో రిలీజ్ అవ్వగా సూపర్ స్టార్ భరత్ అనే నేను ఆ రికార్డులను బ్రేక్ చేసింది.

ఏకంగా 28 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను రిలీజ్ కి ముందు సొంతం చేసుకోనుంది. ప్రీమియర్ షోల తో ఈ సినిమా నెలకొల్పే రికార్డులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరిలోను ఎంతో ఆసక్తిని రేపుతుంది అని చెప్పాలి. మరి ఆ రచ్చ ఎలా ఉంటుందో తెలియాలి అంటే 19 న ప్రీమియర్ షోల వరకు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here