సూపర్ స్టార్ అడుగు పెట్టాడు…సోషల్ మీడియా దద్దరిల్లింది

  మహేష్ బాబు కొత్త సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ కు మెమరబుల్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ కావడం తో.. ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపు అయాయి. కానీ ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ వర్క్స్ కానీ.. కనీసం పేరు కానీ చెప్పకపోవడంతో ఇప్పటివరకూ డిజప్పాయింట్ అయిన అభిమానులకు.. ఇప్పుడు వరుసగా ట్రీట్స్ ఇచ్చేస్తున్నాడు మహేష్.

ఉదయాన్నే #SSMB24 ఫస్ట్ ఓథ్ అంటూ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న వాయిస్ ని రిలీజ్ చేసిన యూనిట్.. ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశారు. ముఖ్యమంత్రి ఛాంబర్ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకుని నడిచి వస్తున్న మహేష్ లుక్ అదిరిపోయింది. ఎయిర్ సుపీరియారిటీ బ్లూ కలర్ షర్ట్.. ప్రుషన్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకుని.. టక్ చేసి మహేష్ నడిచొస్తుంటే.. రెండు కళ్ల చాలడం లేదని చెప్పేయచ్చు.

మరోవైపు ఈ పోస్టర్ ద్వారా.. ‘భరత్ అనే నేను’టైటిల్ ను కూడా కన్ఫాం చేసేశారు. వరుసగా వచ్చేస్తున్న అప్ డేట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. యంగ్ సీఎం లుక్ లో మహేష్ బాబును చూసుకుని.. అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇప్పటికిప్పుడు మూవీ చూసేద్దామనే ఆతృత అభిమానుల్లో కనిపిస్తున్నా.. రిలీజ్ కోసం సమ్మర్ వరకూ ఆగక తప్పదు కదా.

Leave a Comment