ఫ్యాన్స్ కి పూనకాలే…సినిమా అసలు సిసలు కలెక్షన్స్ తెలిసేది ఎప్పుడో తెలిసింది!!

0
244

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పటి వరకు 3 వారలను ముగించుకుని నిర్మాతల లెక్కల ప్రకారం ఇప్పటికే 205 కోట్ల గ్రాస్ ని అందుకున్నా కానీ ఇప్పటి వరకు సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని నిర్మాతలు రివీల్ చేయలేదు. టాలీవుడ్ ఈ మధ్యకాలంలో ఇలా ఓ పెద్ద సినిమాకి ఏరియాల వారి కలెక్షన్స్ రోజు వారి రిలీజ్ కాకుండా ఉండటం ఒక్క భరత్ అనే నేను కే జరిగింది అని చెప్పొచ్చు.

కానీ ఇప్పుడు సినిమా కలెక్షన్స్ రివీల్ అవ్వడానికి సమయం దగ్గర పడింది అంటున్నారు యూనిట్ వర్గాలు. అక్కడ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా అఫీషియల్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ని 25 రోజుల తరువాత రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ లెక్కన సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి…

25 రోజులు అవ్వడం తో సినిమా కలెక్షన్స్ ని 26 వ రోజున ఏరియాల వారిగా అప్ డేట్ చేయబోతున్నారని ఇండస్ట్రీ లో గట్టిగా చెబుతున్నారు. దాంతో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయా అని ఇప్పుడు అభిమానులతో పాటు సామన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here