మహేష్ వెనక్కి తగ్గితే…బన్నీ షాక్ ఇచ్చాడు

0
171

  2018 సమ్మర్ పోరు టోటల్ టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు సౌత్ ఇండియా లోనే హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో పాటు కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలా ముగ్గురు హీరోలు నటించిన క్రేజీ సినిమాలు ఓకే రోజు రిలీజ్ కాబోతుండటం అందరికీ షాక్ ని కలిగించింది. రోబో 2 తప్పుకోవడంతో తెలుగు సినిమాల మధ్య పోరు అనుకున్నా తిరిగి రజినీ కాలా ని అదే రోజు దింపనున్నాడు.

ఇక ఏప్రిల్ 27 న మూడు సినిమాలు కన్ఫాం అనుకుంటున్న సమయంలో మహేష్ భరత్ అనే నేను నిర్మాతలు సినిమాను ఒక రోజు ముందు గానే రిలీజ్ చేయాలని భావించారు. అది సోషల్ మీడియా లో కూడా చెప్పగా వెంటనే కొన్ని నిమిషాల్లో మరో షాకింగ్ న్యూస్ తెలిసింది.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నిర్మాతలు కూడా ఉన్న పళంగా సినిమాను ఒక రోజు ముందే ప్రీ పోన్ చేసి ఇప్పుడు 26 నే రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఆ డేట్ లో ఏముందో కానీ మన హీరోల సినిమాలు పోటి పడి మరీ ఆ వీకెండ్ కే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇది ఫైనల్ అవుతుందా లేక ఎవరైనా పోస్ట్ పోన్ చేసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here