సూపర్ స్టార్ లెక్క 6 వ సారి…లెక్క తెలిస్తే షాక్!!

0
356

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే అల్టిమేట్ రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలో సినిమా మహేష్ కెరీర్ లో బెస్ట్ రికార్డులను కూడా నెలకొల్పి సాలిడ్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరో మైలురాయి ని కూడా సినిమా అందుకుంది.

నైజాం ఏరియాలో సినిమా మూడు రోజుల్లోనే 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మహేష్ బాబు కెరీర్ లో 6 వ సారి 10 కోట్ల మార్క్ ని నైజాం ఏరియా లో అందుకుని సంచలనం సృష్టించింది. ఇది వరకు మహేష్ బాబు నటించిన సినిమాల్లో నైజాం ఏరియా లో….

పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మరియు శ్రీమంతుడు సినిమాలు 10 కోట్ల మార్క్ ని అందుకోగా ఇప్పుడు 6 వ సినిమా గా భరత్ అనే నేను 10 కోట్ల మార్క్ ని నైజాం లో అందుకుని మహేష్ కెరీర్ లో 6వ సారి ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరెన్ని అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here