మహేష్ పరువు తీయడానికే ఆ సినిమా…..ఇప్పుడు??

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో హిట్స్ ఉన్నాయి మరియు ఫ్లాఫ్స్ కూడా ఉన్నాయి… హిట్లు గా నిలిచిన సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాయగా ఫ్లాఫ్ అయిన సినిమాలు కూడా వెండి తెరపై ఎన్నో కొన్ని కలెక్షన్స్ ని సాధించినా బుల్లితెరపై మంచి టి.ఆర్.పి రేటింగ్ ను దక్కించుకుని మహేష్ క్రేజ్ ని పెంచిందే కానీ ఒక్క సినిమా కూడా తగ్గించలేదు…కానీ ఓ సినిమా మాత్రం మహేష్ క్రేజ్ ని భారీగా తగ్గించింది…

ఆ సినిమానే బ్రహ్మోత్సవం….టాలీవుడ్ లో ఎ సినిమా ఎదుర్కోనన్ని విమర్శలు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎదుర్కొని ఆఖరికి బుల్లితెరపై కూడా బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో స్పైడర్ తో మహేష్ మళ్ళీ నిరాశపరిచినా స్పైడర్ తో తమిళ్ లో తన మార్కెట్ ని ఎంతోకొంత పెంచుకున్నాడు.

కానీ ఇప్పుడు ఆ మార్కెట్ ని తగ్గించడానికా అన్నట్లు బ్రహ్మోత్సవం సినిమా తమిళ్ లో డబ్ అయ్యి అతి త్వరలో రిలీజ్ కానుంది…ఇక్కడ ఆడియన్స్ నే ఆకట్టుకొని ఈ సినిమా తమిళ్ నేటివిటీ కోరుకునే ఆడియన్స్ ని ఆకట్టుకునే చాన్స్ లేదని విశ్లేషకులు చెబుతున్నా….తమిళ్ లో ఫేమస్ అయిన యాక్టర్స్ చాలామంది ఈ సినిమాలో ఉండటంతో ఆ చాన్స్ ఉందేమో అని ట్రై చేస్తున్నారు. కొంచం తేడా అయితే మహేష్ క్రేజ్ కి అక్కడ ఈ సినిమా ఎసరు పెట్టె చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు…

Leave a Comment