బ్లాక్ బస్టర్ కాంబో…..మహేష్-సుక్కు…చరిత్ర చిరగడం ఖాయం!!

0
212

  రెండు వరుస ఫ్లాఫ్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమాతో అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా ను వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణం లో చేయబోతున్న మహేష్ బాబు ఆ తర్వాత చేయబోయే సినిమా లిస్టు లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారని చెప్పాలి.

కానీ ఉన్నంతలో త్రివిక్రమ్ మరియు బోయపాటి శ్రీను ల పేర్లు ముందు వినిపించగా ఇప్పుడు వాళ్ళని కాదని సుకుమార్ తో మహేష్ సినిమా ఫైనల్ అయింది. రీసెంట్ గా రంగస్థలం సినిమా తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇది వరకు మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ శ్రీమంతుడు సినిమా చేయగా ఇప్పుడు సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. ఇద్దరు కలిసి ఇది వరకు 1 నేనొక్కడినే లాంటి ఎక్స్ పెరిమెంటల్ మూవీ చేశారు. మరి ఇప్పుడు ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అని అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here