చస్….మహేష్ తగ్గేది లేదు….ఇక యుద్దమే!!…అసలు మ్యాటర్ ఏంటి అంటే??

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు…బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యి భారీ ఫ్లాఫ్స్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే..ఇలాంటి సమయంలో తన అప్ కమింగ్ మూవీ అయిన భరత్ అనే నేను పై భారీ ఆశలు పెట్టుకున్న మహేష్ తనకి సమ్మర్ లో అచ్చొచ్చిన ఏప్రిల్ 27 న పోకిరి రిలీజ్ సమయంలో తన మూవీ ని రిలీజ్ చేయాలని భావించాడు…అదే డేట్ ని అనౌన్స్ చేశాడు.

కానీ అప్పటికే ఆ డేట్ ని అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం బుక్ చేయగా మహేష్ అదే డేట్ కి వస్తున్నాడు అని తెలిసి అల్లు అర్జున్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే డేట్ కి ఫిక్స్ అవ్వగా ఇరు నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో మరో పోటి ఎదురు అయ్యింది.

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ రోబో 2 అదే డేట్ కి ఫిక్స్ అవ్వగా అల్లుఅర్జున్ మూవీ మే 11 కి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు రాగా మహేష్ మూవీ ఏప్రిల్ 13 కి వస్తున్నట్లు వార్తలు వచ్చినా వాటినన్నింటినీ కొట్టి పారేస్తూ ఇప్పుడు ఏప్రిల్ 27 నే సినిమా రిలీజ్ అంటూ మహేష్ అఫీషియల్ PRO నుండి ట్విట్టర్ లో అనౌన్స్ మెంట్ వచ్చింది…దాంతో కోలివుడ్ టాలీవుడ్ సూపర్ స్టార్స్ మధ్య యుద్ధం జరగనుంది…మరి 2 సినిమాల్లో మీ ఓటు ఎవరికి??

Leave a Comment