దిల్ రాజు కి రక్తకన్నీరు మిగిల్చిన మెహబూబా 4 రోజుల కలెక్షన్స్!!

0
352

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మెహబూబా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టెంపర్ కి ముందు కానీ టెంపర్ తర్వాత కానీ సరైన విజయం లేక క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ జగన్నాథ్ ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకోగా సినిమా మొదటి ఆటకే జస్ట్ ఓకే అనిపించు కునే టాక్ ని సొంతం చేసుకుంది…

కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేక వీకెండ్ కే చేతులు ఎత్తేసింది. ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు 9 కోట్ల అవుట్ రేటు ఇచ్చి టోటల్ గా రెండు రాష్ట్రాల రైట్స్ ని తీసుకున్నాడు.

కానీ సినిమా మొత్తం మీద వీకెండ్ లో 1 కోటి కి పైగా షేర్ ని అందుకోగా 4 వ రోజు వర్కింగ్ డే లో భారీ డ్రాప్స్ తో కేవలం 12 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. దాంతో దిల్ రాజు కి ఈ సినిమా తో భారీ షాక్ తగలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ షాక్ ఏ రేంజ్ లో ఉంటుందో మొదటి వారం తర్వాత క్లియర్ గా తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here