మెహబూబా ఓవర్సీస్ టాక్…హిట్టా-ఫట్టా!!

0
716

  దర్శకుడిగా ఒకప్పుడు తిరిగు లేని సినిమాలు తీసిన పూరీజగన్నాథ్ తర్వాత కాలంలో అంత ప్రభావం చూపలేకపోతున్నాడు. తన కథ తన దర్శకత్వంలో చివరి హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఇలాంటి సమయంలో మళ్ళీ తన కొడుకుతో సరికొత్త రీ లాంచ్ టైప్ లో మెహబూబా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు పూరీజగన్నాథ్. కాగా సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే రిలీజ్ అయ్యి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుంది అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది.

ఇండియా పాకిస్తాన్ నేపధ్యంలో వార్ మూవీస్ వచ్చాయి కానీ లవ్ స్టొరీ నేపధ్యంలో కొన్ని సినిమాలే వచ్చాయి. మెహబూబా సినిమా ఆ కోవలోకే వస్తుంది అని అంటున్నారు. కథ సింపుల్ లవ్ స్టొరీ అని కానీ పూరీజగన్నాథ్ మార్క్ సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయని అంటున్నారు.

కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ అనుకున్న రేంజ్ లో లేదని, క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ గా లేదని అంటున్నారు. కానీ పూరీ తనయుడు ఆకాష్ మాత్రం మంచి ఈజ్ తో నటించి ఆ పాత్రలో జీవం పోశాడని….

ఈ సినిమా తర్వాత తనకి మరిన్ని ఆఫర్స్ రావడం పక్కా అని అంటున్నారు, హీరోయిన్ పరవాలేదని, సినిమా మొత్తం మీద పార్టు పార్టులుగా కొన్ని ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయి కానీ ఓవరాల్ మూవీ పరంగా పూరీజగన్నాథ్ తీసిన ఈ మధ్య సినిమాలలో టెంపర్ తర్వాత ఇది బెస్ట్ మూవీ అని అంటున్నారు. మరి ఇక్కడ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here