మెహబూబా మూవీ రివ్యూ…మళ్ళీ షాక్ ఇచ్చిన పూరీ!!

0
868

        పూరీజగన్నాథ్….టాలీవుడ్ లో అల్టిమేట్ మాస్ ఎలిమెంట్స్ తో హీరోల మాస్ ఇమేజ్ ని ఓ రేంజ్ లో పెంచే సత్తా ఉన్న డైరెక్టర్… కెరీర్ స్టార్టింగ్ లో వరుస సెన్సేషనల్ హిట్స్ తో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగిన పూరీ జగన్నాథ్…ఈ మధ్య వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నాడు. ఒక్క ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ తప్పితే సరైన విజయం పూరీ ఖాతాలో ఇప్పటి వరకు పడలేదనే చెప్పాలి.

ఇలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మెహబూబా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాగా ఈ సారి తన కెరీర్ లో ఎప్పుడు లేనిది పునర్జ్నమల కాన్సెప్ట్ తో పూరీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆర్మీ లో చేరాలని కళలు కనే ఓ కుర్రాడు, అనుకోకుండా పాకిస్తాన్ నుండి ఇండియా కి చదువు కోసం వచ్చిన అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అనేక అంతరాల తర్వాత ఇద్దరు ఎలా కలిసారు అన్నది సినిమా కథ.

సినిమా మొదలు అవ్వడం బాగానే మొదలు అయినా…పునర్జ్నమల కాన్సెప్ట్ తో పూరీ చాలా వరకు కన్ఫ్యూజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఫస్టాఫ్ లో సీన్స్ సీన్స్ గా చూసుకుంటే కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.

కానీ ఓవరాల్ గా ఫస్టాఫ్ మొత్తం జస్ట్ ఒకే అనిపించుకోగా సెకెండ్ ఆఫ్ పై ఆశలు పెరిగిపోతాయి. కానీ సెకెండ్ ఆఫ్ సాగదీసి, చాలా వరకు బోర్ సీన్స్ తో కన్ఫ్యూజ్ చేశాడు పూరే. ఇలాంటి కథలో హీరో ఆకాష్ మాత్రం…..

మంచి ఈజ్ తో నటించి మెప్పిస్తాడు. ప్రతీ సీన్ లో ను తన లో ఓ మంచి నటుడు ఉన్నాడని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ కుర్రాడు. కానీ ఇప్పుడే అంత హెవీ రోల్ అవసరమా అనిపించడం మాత్రం ఖాయం అనిపిస్తుంది.

కానీ ఉన్నంతలో ఓకే అనిపించుకోగా హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఓకే అనిపించుకున్నారు. మొత్తం మీద దర్శకుడు పూరీ పూర్తిగా కంబ్యాక్ చేశాడా అంటే….

చేయలేదనే చెప్పాలి…చాలా సీన్స్ లో కొత్త పూరేనే కనిపించాడు కానీ పాత పూరీ కనిపించలేదు. కానీ టెంపర్ తర్వాత పూరీ జగన్నాథ్ తీసిన సినిమాలలో ఈ సినిమా కొంచం బెటర్ అనిపిస్తుంది.

కానీ పూరీ నుండి ఓ ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు లాంటి మూవీ ని ఎక్స్ పెర్ట్ చేస్తే మాత్రం భారీ షాక్ తగలడం ఖాయమని చెప్పొచ్చు. కథ అండ్ సెకెండ్ ఆఫ్ పై పూరీ ఎక్కువ దృష్టి పెడితే బాగుంది అనిపించింది.

123జోష్ రేటింగ్ : 2.75

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here