విజయ్ మెర్సల్(అదిరింది) తెలుగు రివ్యూ….కుమ్మింది బాస్

    కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ ఈ దీపావళి కి తమిళ్ లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకుంది….భారీ అంచనాలతో రావడం తో ఆ అంచనాలను అందుకోవడం తో సినిమా ఓపెనింగ్స్ తో దుమ్ము లేపి ఇప్పటికే 225 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన తర్వాత తెలుగు లో అనేక సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొని ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

కాగా సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అవ్వడం తో మాస్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యే చాన్స్ ఉంది….సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగిలిన సినిమా మొత్తం యూనివర్సల్ నేటివిటిగా ఉంటుంది అని చెప్పొచ్చు.

ఫస్టాఫ్ రేసీగా అద్బుతమైన విజవల్స్ తో వావ్ అనిపించే విధంగా ఉంటుంది…విజయ్ మూడు పాత్రల్లో అదరగొట్టేశాడు…మెడికల్ మాఫీయా గురించి చర్చించిన విధానం ఆకట్టుకుంటుంది… ఇక చివర్లో జి.ఎస్.టి పై చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టించడం ఖాయం..

హీరోయిన్స్ సమంత, కాజల్ మరియు నిత్యమీనన్ లలో నిత్యమీనన్ కి నటించడానికి మంచి స్కోప్ దక్కగా సమంత మరియు కాజల్ లు సాంగ్స్ కే పరిమితం అయ్యారు…ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది.

డైరెక్టర్ అట్లీ తెలిసిన కథనే అయినా చెప్పిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకున్న విధానం నచ్చుతుంది. సినిమా లెంత్ ఎక్కువ అవ్వడం అలాగే సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ గా ఉండటం చిన్న మైనస్ పాయింట్స్…ఇవి పక్కకు పెడితే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమాల్లో బెస్ట్ ఇదే అని చెప్పొచ్చు. మిగిలిన సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment