పెట్టింది 10–అమ్మింది 15….టోటల్ గా వచ్చింది ఇది!!

0
1313

  నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ MLA, కాజల్ అగర్వాల్ హిరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి అనుకున్న సమయం దొరకలేదు. బ్రేక్ ఈవెన్ కి మరింత కష్టపడాలి అనుకున్న సమయంలో రంగస్థలం రిలీజ్ అవ్వడం MLA సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోవడం చాలా కష్టం అయ్యింది.

మొత్తం మీద సినిమాను 10 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించగా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 15 కోట్ల వరకు జరిగింది. ఇక 16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారం మొత్తం మీద 9 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక రెండో వారం నుండి మిగిలిన రోజులు అన్నీ కలుపుకుని మొత్తం మీద కేవలం 1.6 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది ఈ సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 10.6 కోట్ల షేర్ మాత్రమె కలెక్ట్ చేసి ఫ్లాఫ్ గా మిగిలిపోయి కళ్యాణ్ రామ్ కెరీర్ లో మూడో వరుస ఫ్లాఫ్ గా నిలిచి షాక్ ఇచ్చింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here