11 గంటల్లో 1 మిలియన్….తర్వాత 13 గంటల్లో 6 మిలియన్…చరిత్ర చిరిగిపోయింది!!

0
436

తెలుగు సినిమా చరిత్రలో ట్రైలర్స్ విషయం లో మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా బాహుబలి 2 ట్రైలర్ ఏ ట్రైలర్ కి కూడా అందనంత ఎత్తులో 21 మిలియన్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించింది. దాంతో ఆ ట్రైలర్ ని మరిచిపోయి మిగిలిన సినిమాలు అన్నీ నాన్ బాహుబలి రికార్డ్ ల పైనే దృష్టి పెట్టగా ఎన్టీఆర్ జైలవకుశ సినిమాతో సరికొత్త రికార్డ్ కొత్తగా ఆ రికార్డ్ పవన్ అజ్ఞాతవాసి తో కొట్టాడు.

24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూస్ దాకా సాధించి చరిత్ర సృష్టించగా తర్వాత వచ్చిన పెద్ద సినిమాలు ఏవి ఈ రికార్డ్ ను అందుకోలేకపోయాయి. కానీ పెద్దగా అంచనాలు లేని కళ్యాణ్ రామ్ తమన్నా ల నా నువ్వే మూవీ మాత్రం 24 గంటల్లో చరిత్ర చిరిగిపోయేలా చేసింది.

మొదటి 11 గంటల్లో 1 మిలియన్ ని మాత్రమే అందుకున్నా తర్వాత 13 గంటల్లో ఏకంగా 6 మిలియన్ వ్యూస్ ని అందుకుని 24 గంటల్లో 7 మిలియన్ వ్యూస్ తో నాన్ బాహుబలి హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించిన ట్రైలర్ గా నిలిచింది. దాంతో ఈ రేంజ్ లో వ్యూస్ ఎలా వచ్చాయి అని ఇప్పుడు అందరు ఒకింత షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా రికార్డ్ మాత్రం ఇప్పుడు కళ్యాణ్ రామ్ సొంతం చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here