ఇక్కడ డిసాస్టర్…అక్కడ సూపర్ హిట్…ఇదేమి షాక్ సామి!!

0
514

స్టైలిష్ స్టార్ బన్నీ ఎన్నో ఆశలతో శారీరకంగా… మానసికంగా తనను మార్చుకుని ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. టీజర్.. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన సూర్య… థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అనుకున్నంతగా తెలుగువాళ్లకి ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్న కలెక్షన్లు మాత్రం పెరగడం లేదు. ఇక్కడ డిజాస్టర్ లిస్టులో చేరేందుకు రెఢీగా ఉన్న ఈ సినిమా… కేరళలో మాత్రం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తెలుగులో భారీ రేట్లకి అమ్మడంతో బయ్యర్లకి నష్టాలు తప్పేలా లేవు. తమిళ- మలయాళ హక్కులకు పెట్టిన ఖర్చు వెనక్కివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళలో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలన్నీ మలయాళంలో డబ్ అవ్వడం జరుగుతుంటుంది.

ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. ‘ఎండె పేరు సూర్య ఎండె వీడు ఇండియా’ పేరుతో విడుదలైన మలయాళ వెర్షన్ 12 రోజుల్లోనే 5 కోట్లు వసూళ్లు సాధించింది. కేరళలో ఈ స్థాయి వసూళ్లు రావడమంటే రికార్డే! బన్నీ- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ అక్కడ 7.60 కోట్లు వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు డబ్బింగ్ చిత్రంగా నిలిచింది.

త్వరలో ఆ రికార్డును సూర్య చెరిపేసేలానే ఉన్నాడు. ఇప్పటికీ అక్కడ 80 థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. స్టైలిష్ స్టార్ కష్టాన్ని తెలుగు అభిమానులు పట్టించుకోకపోయినా… తమ మల్లు అర్జున్ చేసిన కొత్త ప్రయత్నాన్ని బాగానే రిసీవ్ చేసుకుని కూసింత సంతోషాన్ని మిగిల్చారు కేరళ బన్నీ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here