నా పేరు సూర్య రివ్యూ…షాక్ ఇచ్చింది…కానీ!!

0
1361

        స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం ఉన్న హీరోలందరి లోకి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో. వరుస గా 50 కోట్ల సినిమాలతో సంచలన రికార్డులను నమోదు చేసిన అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ అంచనాల నడుమ వచ్చేసింది. సినిమా అల్లుఅర్జున్ కెరీర్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళే సినిమా అంటూ రిలీజ్ కి ముందు నుండి పాజిటివ్ బజ్ ఈ సినిమా కి ఏర్పడింది.

కాగా సినిమా కథ ఎలా ఉందంటే…మిలటరీ లో చేరినా చిన్నప్పటి నుండి కోపాన్ని అదుపులో పెట్టుకోలేని సూర్యకి మిలటరీ అంత కోపం ఉంటె పనికి రాదని చెప్పినా ఒక అనుకోని పనిని చేసి మిలటరీ నుండే తీసివేయబడతాడు…..

కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటే తిరిగి మిలటరీ లో జాయిన్ అవ్వడానికి ఒక అవకాశాన్ని ఇస్తామని చెప్పడంతో సైక్రియాటిస్టు దగ్గరకి వెళతాడు సూర్య…తరువాత తన లైఫ్ లో జరిగిన పరిణామాలు ఎలాంటి అన్నది మిగిలిన కథ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో అను ఎమాన్యుఎల్ లో లవ్ ట్రాక్ ఉన్నా అది పరిమితంగానే ఉంటుంది.

అల్లుఅర్జున్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన లుక్ కి అలవాటు పడటానికి కొంత సమయం పట్టినా తర్వాత ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అను జస్ట్ ఓకే అనిపించుకాగా అర్జున్ మరియు సాయికుమార్ ల పెర్ఫార్మెన్స్ బాగుంది.

మిగిలిన నటీనటులు ఆకట్టుకోగా సంగీతం యావరేజ్ గాను బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని చెప్పాలి. మిగిలిన సాంకేతిక నిపుణులు పర్వాలేదు అనిపించుకోగా నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్టర్ గా ఫుల్ మార్కులు వేయించుకోలేకపోయాడు.

కథగా చెప్పడానికి చాలా ఉన్నా తెరకెక్కించిన విధానంలో సీన్స్ సీన్స్ గా బాగున్నాయి అనిపించే సీన్స్ ఎక్కువగా ఉన్నా టోటల్ మూవీ చూస్తె మాత్రం కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది, మిగిలిన బోర్ సీన్స్ అన్నీంటిని అల్లుఅర్జున్ తన పెర్ఫార్మెన్స్ తో యాటిట్యూడ్ తో పాజిటివ్ గా మార్చే ప్రయత్నం చేశాడు.

అల్లుఅర్జున్ ఇంట్రో, రెండు సాంగ్స్, ఫస్టాఫ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్, సెకెండ్ ఆఫ్ సాయికుమార్ ఇంటి ఫైట్ సీన్ ఓ రేంజ్ లో పేలాయి అని చెప్పాలి. అవి కాకుండా అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపించగా క్లైమాక్స్ ఒకింత షాక్ ని కలిగించింది అని చెప్పొచ్చు.

అయినా అల్లుఅర్జున్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం…రీసెంట్ గా చేసిన డీజే కన్నా కూడా ఈ సినిమా బెటర్ గా ఉండటం ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లు అని చెప్పొచ్చు. కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నా కానీ నా పేరు సూర్య ఆకట్టుకుంటుంది.

123జోష్ రేటింగ్—–3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here