నాపేరుసూర్య పై భరత్ హోళీ ఫైట్ అస్త్రం!!

0
372

  భరత్ అనే నేను సినిమా ఇప్పటికే హిట్ అయింది. ఈ సినిమా వసూళ్లను కాస్త ఎక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శల్ని పక్కనపెడితే సినిమా మాత్రం ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. ఇలాంటి టైమ్ లో “నా పేరు సూర్య” సినిమా వస్తోంది. ఈ వీకెండ్ భారీ స్థాయిలో విడుదలకానున్న ఈ సినిమా నుంచి రాబోయే పోటీని తట్టుకోవాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఇక్కడే కొరటాల అండ్ టీం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొస్తోంది.

నా పేరు సూర్య విడుదల కానున్న 4వ తేదీ నుంచే భరత్ అనే నేను సినిమాకు అదనంగా కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా కొరటాల, మహేష్ కు ఎంతో ఇష్టమైన హోలీ ఫైట్ సీన్ ను 4వ తేదీ నుంచి భరత్ అనే నేను సినిమాలో చూపించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల బాక్సాఫీస్ వద్ద సూర్యకు పోటీగా భరత్ మరింత స్ట్రాంగ్ గా నిలబడతాడని, వసూళ్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుందని యూనిట్ భావిస్తోంది.

యూనిట్ ఆలోచనలో కాస్త లాజిక్ ఉంది. హిట్ అయిన సినిమాకు మరికొన్ని సన్నివేశాలు యాడ్ చేస్తే కచ్చితంగా అది ఆసక్తి రేకెత్తిస్తుంది. మరోసారి చూద్దాం అనే ఉత్సుకత పెంచుకుంది. కాకపోతే ఇలా ఒక సీన్ తో టోటల్ బన్నీ సినిమాకే పోటీగా నిలుద్దాం అనుకుంటే మాత్రం తప్పు. నా పేరు సూర్య సినిమా క్లిక్ అయితే, ఇలాంటి సన్నివేశాలు జతచేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here