నాపేరుసూర్య Vs DJ….అక్షరాలా 6 కోట్లు….కొట్టాలి సామి!!

0
240

  బాక్స్ ఆఫీస్ దగ్గర స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మొదటి వీకెండ్ మొత్తం మీద 37.5 కోట్లకు పైగా షేర్ ని సాధించి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా కొత్త దర్శకుడితో ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కాగా మొత్తం మీద అల్లుఅర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ అయిన దువ్వాడ జగన్నాథం సినిమా ఈ సినిమా ను కంపేర్ చేసి చూస్తె…

దువ్వాడ జగన్నాథం మొదటి వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 34.75 కోట్ల షేర్ ని అందుకోగా నాపేరుసూర్య మాత్రం 27.75 కోట్ల షేర్ ని అందుకుని మొత్తం మీద దువ్వాడ జగన్నాథం కన్నా 7 కోట్లు వెనకాల ఉంది అని చెప్పొచ్చు.

అదే సమయంలో దువ్వాడ జగన్నాథం వరల్డ్ వైడ్ గా 3 రోజులకు గాను 43.6 కోట్ల షేర్ ని వసూల్ చేయగా నాపేరుసూర్య మాత్రం 37.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో ప్రస్తుతానికి మొత్తం మీద దువ్వాడ జగన్నాథం సినిమా కన్నా 6 కోట్లు వెనకాల ఉంది నాపేరుసూర్య సినిమా. మరి 4 వ రోజు సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here