నాని సినిమాకి ఈ రేంజ్ క్రేజా…టాలీవుడ్ మొత్తం…..??

వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని…. భలే భలే మొగాడివోయ్ నుండి వరుస విజయాలతో ఒక్కటంటే ఒక్క అపజయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న నాని ఈ ఏడాది ఇప్పటికే నేను లోకల్ మరియు నిన్ను కోరి సినిమా లతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి మంచి జోరు మీదున్నాడు. ఇక ఇప్పుడు MCA-మిడిల్ క్లాస్ అబ్బాయ్ సినిమా తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

కాగా ఈ సినిమా టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దూసుకు పోతుంది. దాంతో పాటు లైక్స్ విషయంలోనూ సత్తా చాటిన ఈ టీసర్ టాలీవుడ్ లో లక్ష లైక్స్ తెచ్చుకున్న అతి కొద్ది టీసర్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక 7 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీసర్ సినిమాపై యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చేయగా ఇక ట్రైలర్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తిని కూడా పెంచేలా చేసింది. ఇక సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Leave a Comment