వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మధ్యలో నాసి రకం సినిమాలు చేసినా పాస్ అయిపోయాయి. దీంతో కథల పరంగా జాగ్రత్త తీసుకోకుండా ఆడియన్స్‌ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నాడు. ఎంసిఏ లాంటి బిలో యావరేజ్ సినిమా కూడా మంచి వసూళ్లు తెచ్చుకోవడంతో తన సినిమాలు ఎలా వున్నా జనం ఆదరించేస్తారనే ఫాల్స్ వరల్డ్‌లోకి వెళ్లిపోయిన నాని మూల్యం చెల్లించుకున్నాడు. అతని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలకి ముందే జనం దృష్టిని ఆకర్షించలేకపోయింది.
తొలి రోజు వసూళ్లు ఫర్వాలేదనిపించినా కానీ టాక్ బాలేకపోవడంతో రెండవ రోజుకే వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రం ఫెయిలవడంతో మరోసారి రంగస్థలం టేకోవర్ చేసి శని, ఆదివారాల్లో ‘కృష్ణార్జున యుద్ధం’ కంటే ఎక్కువ షేర్లు వసూలు చేసింది. తనకి గ్యారెంటీ మార్కెట్ అయిపోయిన యుఎస్‌లో కూడా ఈసారి నాని పప్పులు ఉడకలేదు.
‘కృష్ణార్జున యుద్ధం’ వసూళ్లు గత వారం విడుదలైన ఫ్లాప్ సినిమా ‘ఛల్ మోహన్ రంగ’ కంటే తక్కువ వచ్చేట్టున్నాయి. ఆడియన్స్ తనని ఓన్ చేసేసుకున్నారంటూ తెగ సంబరపడిపోయిన నాని తన సక్సెస్‌కి కారణాలు ఏమిటనేది గుర్తించలేదు. ఏది చేస్తున్నా చూస్తున్నారనే భ్రమలో పడి పరాజయం కొని తెచ్చుకున్నాడు.