నాని MCA మూవీ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా…ఫట్టా….ఇదే రిపోర్ట్

0
1739

   ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ  MCA మూవీ…. దిల్ రాజు నిర్మాతగా సాయిపల్లవి హీరోయిన్ గా భూమిక వదిన రోల్ లో నటించిన MCA మూవీ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా భారీ ఎత్తున ప్రీమియర్ షోల తో ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యింది…. అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందామ్ పదండీ…

చిన్నప్పటి నుండి కలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య సడెన్ గా వదిన ఎంటర్ అయితే అన్నదమ్ముల మధ్య కొంత గ్యాప్ రావడం చాలా సహజం…తర్వాత వదిన మరిది ల మధ్య చిన్న చిన్న క్లాషేస్ రావడం కూడా కామన్….ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ తో తెరకక్కిన MCA మూవీ మొదటి అర్ధభాగం మంచి కామెడి సీన్స్ అలరించారు.

సెకెండ్ ఆఫ్ లో అసలు కథ మొదలు అయినా అది కొంతవరకు మాత్రమె ప్రేక్షకుల అంచనాలను అందుకుంది….నాని మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకు తన నటనతో, డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక సాయిపల్లవి జస్ట్ ఓకే అనిపించుకుంది…

భూమిక చావ్లా వదిన రోల్ లో ఫుల్ మార్కులు దక్కించుకుంది…వదిన రోల్ లో ఫ్రెష్ ఫీలింగ్ కలిగించి నాని తర్వాత భూమిక ఎక్కువ మార్కులు దక్కించుకుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఓకే అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించే విధంగా ఉందని చెప్పొచ్చు.

మొత్తం మీద ప్రీమియర్ షోల నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా బాగుంది కానీ మరీ అద్బుతం కాదని అంటున్నారు. నాని సినిమాలు సింపుల్ గా ఒకసారి చూసే సినిమాలు అవ్వడం ఈ సినిమా అదే కోవలోకి చేరే సినిమా అవ్వడం తో కచ్చితంగా మంచి కలెక్షన్స్ సాధించే సినిమా అవుతుంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here