నాని MCA రివ్యూ…సూటిగా సుత్తిలేకుండా…కుమ్మేసిన నాని!! కానీ

    కెరీర్ లో ఆల్ టైం హై పొజిషన్ లో ఉన్న యంగ్ హిరో నాని స్టార్ హీరోల లీగ్ లో ఎంటర్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న సమయం లో తన కెరీర్ లో ఏ సినిమాకు లేనంత హైప్ నడుమ MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నాని కెరీర్ లో ఈ రేంజ్ లో రిలీజ్ అయిన సినిమా మరోటి లేదు…

మరి ఇంతటి క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఎంతవరకు సఫలం అయ్యాడు….మరో హిట్ కొట్టాడా లేదా అన్న అసలు విషయంలోకి వచ్చేస్తే….సింపుల్ కథని ఎంచుకుని మంచి సీన్స్ ని జోడించి మొదటి అర్ధభాగం అద్బుతంగా తెరకెక్కించి అన్ని కమర్షియల్ హంగులను జోడించారు.

కానీ సినిమాకు కీలకం అయిన సెకెండ్ ఆఫ్ లో కథ రొటీన్ గా సాగడం….చూసే ప్రేక్షకులు ఈజీగా ఊహించే విధంగా సీన్స్ ఒకటి తర్వాత ఒకటి రావడం, వాటికి తోడూ పాటలు ఉండటం ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడొచ్చు అన్న భావనని మాత్రమె కలిగిస్తుంది.

నాని తనదైన స్టైల్ లో మరోసారి ఆకట్టుకున్నాడు…డైలాగ్స్ అండ్ నాచురల్ యాక్టింగ్ తో కుమ్మేసిన నాని ఈజీగా సినిమాను మోశాడు. సాయిపల్లవి జస్ట్ ఓకే అనిపించుకోగా భూమిక అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసి షాక్ ఇచ్చింది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం విషయంలో ఎందుకనో ఈ సారి తన మార్క్ ని అందుకోలేకపోయాడు… కానీ ఉన్నంతలో ఓకే అనిపించుకున్నాడు. ఇక నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు అదుర్స్ అనిపించగా సినిమా ఉన్నంతలో ఫుల్ రిచ్ గా అద్బుతమైన వరంగల్ లోకేషన్స్ తో ఆకట్టుకుంది.

అంతా బాగున్నా వేణు శ్రీ రామ్ ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ ను ట్రీట్ చేసిన విధానం జస్ట్ యావరేజ్ మార్కులు వేయించుకుంది… కానీ నాని మరియు భూమికలు సినిమాను నిలబెట్టారు… ఈ ఈవెంట్ ఉన్న సినిమా పోటిని తట్టుకునే కెపాసిటీ సినిమాకు ఉందని చెప్పొచ్చు… లాంగ్ వీకెండ్ కూడా ఉండటం నానికి ప్లస్ పాయింట్… మరి ఈ అవకాశాన్ని నాని సరిగ్గా వాడుకుంటే మరో హిట్ కొట్టే చాన్స్ ఉంది…

Leave a Comment