చరిత్ర తిరగరాసిన నాని…ఏ హీరో కి లేని చారిత్రిక రికార్డ్ ఇది

0
499

  వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని ఇప్పుడు మరో చరిత్ర సృష్టించాడు…టాలీవుడ్ హీరోలలో ఎవ్వరికీ లేని ఈ చారిత్రిక రికార్డ్ తో సంచలనం సృష్టించి టోటల్ టాలీవుడ్ కి షాక్ ఇచ్చాడు. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ మరియు నిన్నుకోరి సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి దుమ్ము లేపిన నాని రీసెంట్ గా MCA సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చాడు.

కాగా ఈ సినిమా ఓవర్సీస్ లో రీసెంట్ గా 1 మిలియన్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ చరిత్రలోనే ఓకే క్యాలెండర్ ఇయర్ లో చేసిన మూడు సినిమాలతో మూడు సార్లు 1 మిలియన్ మార్క్ ని అందుకున్న ఓకే ఒక్కడు గా నిలిచి చారిత్రిక రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

స్టార్ హీరోలు ఎవ్వరు ఇయర్ కి మహా అయితే 2 సినిమాలకు మించి చేయలేకపోవడం…నాని వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయగలుగుతుండటంతో ఈ అల్టిమేట్ రికార్డ్ నాని వశం అయ్యింది. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డ్ బ్రేక్ చేసే హీరో ఎవరు అవుతారో చూడాలి. లేక నాని 2018 లో మరోసారి తన రికార్డ్ ను తాను తిరగరాసినా ఆశ్యర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here