నాపేరుసూర్య కర్ణాటకలో ఎన్ని థియేటర్స్ లో రిలీజో తెలిస్తే షాక్!!

0
277

  వరుస 50 కోట్ల హీరో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా భారీ అంచనాల నడుమ మే 4 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అసలే సమ్మర్ సీజన్ లో రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు దుమ్ము లేపే రేంజ్ లో వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు అందరు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా  కూడా అదే రేంజ్ లో భీభత్సం సృష్టించాలని కోరుకుంటున్నారు.

కాగా సినిమాను రెండు రాష్ట్రాలలో భారీ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన నిర్మాతలు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా సినిమా ని భారీ గా రిలీజ్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో అక్కడ దువ్వాడ జగన్నాథం 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేయనున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అక్కడ ఏకంగా 320 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఓపెనింగ్స్ పరంగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా  అల్లుఅర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here