నేనే రాజు నేనేమంత్రి 6 రోజుల టోటల్ షేర్ అండ్ గ్రాస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఆగస్టు 11 న మినీ సంక్రాంతిని తలపించేలా మూడు సినిమాలు రిలీజ్ అవ్వడంతో అందరు సంక్రాంతి రేంజ్ కలెక్షన్స్ ని ఆశించారు. కానీ రిలీజ్ అయిన అన్ని సినిమాలు మరీ అద్బుతమైన టాక్ తెచ్చుకోకపోవడంతో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు.

కానీ ఉన్నంతలో రానా నటించిన నేనేరాజు నేనేమంత్రి మాత్రం అందరి అంచనాలను తలకిందలు చేస్తూ 6 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 18.6 కోట్ల షేర్ ని వసూల్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 32.4 కోట్లను చేరింది.

సినిమా బిజినెస్ ని 6 రోజుల్లో రాబట్టిన సినిమా ఇకమీదట కలెక్ట్ చేసే మొత్తం లాభం కిందే వెళుతుంది..సినిమా జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో కచ్చితంగా 25 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment