NEXT నువ్వే మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

0
1507

    లవ్ లీ తర్వాత క్లీన్ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆది…. టెలివిజన్ నుండి వెండితెరపై తన మార్క్ ని చూపించాలి అని కోరుకున్న ప్రభాకర్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సరికొత్త నిర్మాణ సంస్థ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ NEXT నువ్వే ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేయగా సినిమా ఎలా ఉంటుంది అనేది అందరిలోనూ ఆసక్తిని రేపింది.

కాగా ఇప్పుడు టాలీవుడ్ లో కలిసి వస్తున్న హర్రర్ కామెడీ నేపద్యంలో లోనే వచ్చిన ఈ సినిమా ఆ సినిమాలు అలవాటు పడ్డవారికి రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ కామెడీ సీన్స్ ని చూసుకుంటే ఒక్కో సీన్ గా కామెడీ సీన్స్ ఆకట్టుకోగా మాస్ ని అలరించడానికి హీరోయిన్స్ ఉండనే ఉన్నారు.

కాగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్ని అక్కడక్కడ పేలగా మొత్తం మీద సినిమా అక్కడక్కడా కామెడీ తో అక్కడక్కడ రొటీన్ కథతో ముగింపు దశలో రఘుబాబు వర్మ పేరడీ కథతో ముగిస్తుంది. ఇలాంటి సినిమాలు ఇష్టపడే వారికి వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు.

కొత్తతనం కోరుకునేవారికి సినిమా పెద్దగా రుచించే అవకాశం తక్కువ…కామెడీ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని చూడొచ్చు. ఆదికి ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మంచి సినిమా అని చెప్పొచ్చు. ప్రభాకర్ కొత్తగా ట్రై చేయకున్నా ఉన్నంతలో దర్శకత్వంలో మెప్పించి పాస్ మార్కులు వేయించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here