నితిన్ లై ఫస్ట్ రివ్యూ…హిట్టా ఫట్టా

0
453

కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తో పాటు ప్రతిష్టాత్మక 50 కోట్ల క్లబ్ ని అ..ఆ సినిమాతో అందుకున్న నితిన్…కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా లై నేడు ప్రేక్షకులముందుకు రాగా అంతకుముందే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల రెస్పాన్స్ కూడా బయటికి వచ్చేసింది.

హీరో విలన్ ల మధ్య మైండ్ గేమ్ తో సాగే సినిమా అనేక ట్విస్ట్ లతో ఆకట్టుకుందని అంటున్నారు…కానీ సినిమా సెకెండ్ ఆఫ్ తో పోల్చుకుంటే ఫస్టాఫ్ కొద్దిగా వీక్ గా ఉందని….అలాగే కొద్దిగా స్లోగా కూడా ఉందని అంటున్నారు. కానీ నితిన్ పెర్ఫార్మెన్స్ మరియు అర్జున్ అదిరిపోయే విలనిజం సినిమాకు హైలెట్ గా నిలిచాయని అంటున్నారు.

దాంతో పాటే మణిశర్మ అందించిన పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఎటొచ్చి సినిమా క్లాస్ మరియు ఇంటలీజెన్స్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుందని సామాన్య ప్రేక్షకులకు అంత ఈజీగా ఎక్కే అవకాశం లేదని…దాంతో పాటే పోటిలో మరో రెండు కమర్షియల్ మూవీస్ ఉండటం లైకి ఎదురుదెబ్బ అని అంటున్నారు. ఇవన్నీ ఓవర్సీస్ నుండి వస్తున్న మాటలు…మరి రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here