నైజాం సీడెడ్-ఎన్టీఆర్ వే…ఆ రెండు సినిమాలకు కొట్టే సత్తా ఉందా??

0
394

  టాలీవుడ్ లో అనేక రికార్డులు బాహుబలి వశం అవ్వగా మిగిలిన రికార్డులను అన్నీ నాన్ బాహుబలి రికార్డులుగా పిలుచుకుంటూ ఒక్కో హీరో ఒక్కో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాంటి రికార్డులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రెండు అల్టిమేట్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. జనతాగ్యారేజ్ తో ఒక రికార్డ్ అలాగే జైలవకుశ సినిమాతో మరో రికార్డ్ ను తన పేరిట లిఖించుకుని సత్తా చాటి షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్.

నైజాం లో జనతాగ్యారేజ్ తో మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డ్ కొట్టగా సీడెడ్ లో కూడా 4 కోట్లకు పైగా షేర్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు. ఆ రెండు రికార్డులను తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమాలు బ్రేక్ చేయాలి అని చూసి ఏవి కూడా అందుకోలేక పోయాయి…

ఇక ఇప్పుడు మహేష్ నటించిన భరత్ అనే నేను మరియు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ల నా పేరు సూర్య రెండు 15 రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఆ రెండు రికార్డులను ఈ సినిమాలో ఏవి బ్రేక్ చేస్తాయి అనేది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here