నైజాం గడ్డపై ఎన్టీఆర్ భీభత్సం…5 సార్లు ఆ రికార్డ్…వరుసగా 4 సారి చరిత్ర

నైజాం ఏరియా…. ఎన్టీఆర్ కి 2015 కి ముందు వరకు మిగిలిన స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ లేని ఏరియాలో ఒకటి…ఇక్కడ ఎన్టీఆర్ తన ఫాలోయింగ్ పెంచుకోవాలని చేసిన ప్రయత్నాలలో మంచి సినిమాలు పడక పోవడంతో అనుకున్న రేంజ్ వసూళ్ళని సొంతం చేసుకోవడం లో విఫలం అయ్యాడు. కానీ అప్పటి నుండి వరుసగా మంచి సినిమాలు చేస్తూ అద్బుతమైన కలెక్షన్స్ ని సాధిస్తూ సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.

 ఇప్పుడు మిగిలిన హీరోలకి కూడా సాధ్యం కానీ లెవల్ లో మొదటిరోజు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ నెలకొల్పిన 5.51 కోట్ల రికార్డు ఇప్పటికీ అలాగే కొనసాగుతుండటం ఎన్టీఆర్ క్రేజ్ ని నిదర్శనం. ఇక ఇప్పుడు వరుసగా ఎన్టీఆర్ నటించిన 4 సినిమాలు అక్కడ వరుసగా 10 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.

టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ సినిమాలు వరుసగా 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా ఇది వరకు బాద్ షా మూవీ కూడా 10 కోట్ల మార్క్ ని అందుకోవడం మొత్తంగా ఎన్టీఆర్ కెరీర్ లో 5 వ సారి 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన మూవీగా నిలిచి సంచలనం సృష్టిస్తుంది.

Leave a Comment