NTR 241..రామ్ చరణ్ 291..ఏంటి సామి ఈ రచ్చ అసలు??

0
629

  ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కలయిక లో త్వరలోనే టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే… కాగా సోషల్ మీడియా లో ఈ ఇద్దరి ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే… కాగా ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాల ఫస్ట్ లుక్ లు కూడా ఇప్పుడు రికార్డ్ లెవల్ లో ట్రెండ్ అయ్యి భీభత్సం సృష్టించాయి అని చెప్పొచ్చు.

కాగా మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ మూవీ అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో సోషల్ మీడియా ఓ రేంజ్ లో ఊగిపోయి ఏకంగా మొదటి 24 గంటల్లో ఆల్ టైం టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తూ 2 లక్షల 41 వేలకు పైగా ట్వీట్స్ తో సంచలనం సృష్టించింది.

కాగా ఆ రికార్డ్ ను తర్వాత ఎవ్వరు బ్రేక్ చేయలేదు…మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఫస్ట్ లుక్ ఆల్ టైం రికార్డులు తిరగరాస్తూ ఏకంగా 24 గంటల్లో 2 లక్షల 91 వేల ట్వీట్స్ తో సంచలనం సృష్టించాయి…ఈ ఇద్దరు హీరోల సినిమాలే ఈ రేంజ్ రచ్చ చేస్తే ఇద్దరు కలిసి నటించే సినిమా ఫస్ట్ లుక్ మరే రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here