2 ఎకరాల్లో రాయలసీమ సెట్…ఎన్టీఆర్28 న్యూ అప్ డేట్!!

0
479

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోంది. రామోజీ ఫిలిం సిటీలో రెండెకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 13 నుంచే నిరవధికంగా జరుగుతోంది. దీని కోసం రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని ప్రతి బింబించేలా సెట్ రూపొందించినట్టు తెలిసింది. దీని కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకుని యమదొంగ టైం నాటి ఫిజిక్ లోకి మారిపోయిన తారక్ ను చూసి ఫాన్స్ ఇప్పటికే దీని మీద చాలా అంచనాలు పెట్టేసుకున్నారు.

వినిపిస్తున్న సమాచారం మేరకు ఇందులో యంగ్ టైగర్ సీమకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ కి నచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇందులో చాలానే ఉంటాయట. కేవలం ఆరు నెలల డెడ్ లైన్ తో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీలో హీరొయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

చాలా కీలకమైన మరో ముఖ్యమైన పాత్ర సీనియర్ హీరొయిన్ ని తీసుకున్నారు అనే వార్త వచ్చింది కాని అది ఎవరు అనేది మాత్రం బయటికి రాలేదు. ప్రస్తుతం టీం తో పాటు తారక్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జై లవకుశ తర్వాత సుమారు 7 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న జూనియర్ బరువు తగ్గడం కోసమే నాలుగు నెలలు ఖర్చు పెట్టడం ఇప్పటికే హాట్ టాపిక్ గా ఉంది. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here