ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్…కొన్ని గంటల్లో..??

0
549

  గత కొంత కాలంగా వరుస బాక్స్ విజయాలతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి రెడీ అయ్యాడు. తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతోన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ లో ఉన్న త్రివిక్రమ్ కూడా తన నుంచి మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఈ స్క్రిప్ట్ పై హార్డ్ వర్క్ చేశాడు. అయితే ఇటీవల సినిమా ఫుల్ స్క్రిప్ట్ ని దర్శకుడు పూర్తి చేశాడు.

తారక్ కి అలాగే నిర్మాతకు మరోసారి ఫుల్ కథను వినిపించి సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ కూడా ప్రాజెక్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నాడు. టెంపర్ నుంచి విభిన్న పాత్రలను చేసుకుంటూ వస్తోన్న తారక్ ఈ సినిమాలో కూడా సరికొత్తగా కనిపించనున్నాడట. క్యారెక్టర్ కోసం గత కొంత కాలంగా వర్కౌట్స్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ కి కూడా తన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఫైనల్ గా శుక్రవారం సెట్ చేసుకున్న ముహూర్త సమయానికి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబందించిన న్యూస్ ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ కూడా చెబుతోంది. మరి ఈ సినిమా త్రివిక్రమ్ కి ఎంతవరకు బూస్ట్ ఇస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here