(5-7) అరాచకం సృష్టించిన || యంగ్ టైగర్ భీభత్సం ఇది ||

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 81.5 కోట్ల షేర్ తో భీభత్సం సృష్టిస్తూ దూసుకుపోతుండగా క్లీన్ హిట్ కి మరో 4.5 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉన్నా GST దెబ్బ కొట్టడం తో సెమీ హిట్ గా నిలవనుంది. కాగా సినిమా తో ఎన్టీఆర్ పేరిట అల్టిమేట్ రికార్డులు వచ్చి పడగా రెండు బాక్ 2 బాక్ 80 కోట్ల సినిమాలతో అల్టిమేట్ రికార్డులు నమోదు చేశాడు ఎన్టీఆర్.

కాగా సినిమా కలెక్షన్స్ ఆల్ టైం టాప్ 10 మూవీస్ లో చూస్తె టాప్ 10 లో ఎన్టీఆర్ నటించిన సినిమాలు 2 ఉండటం అందులో ఒకటి 5 వ ప్లేస్ లో కాగా మరోటి 7 వ ప్లేస్ లో ఉండటం ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ భీభత్సానికి నిదర్శనం అని చెప్పొచ్చు.

జనతాగ్యారేజ్ 85 కోట్లతో టాప్ 5 లో ఉండగా జైలవకుశ 81.5 కోట్లతో టాప్ 7 ప్లేస్ లో ఉంది. 6 వ ప్లేస్ కి వెళ్ళాలి అంటే మగధీర టోటల్ అన్ని భాషల కలెక్షన్స్ 83 కోట్లను అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా పరుగును ఆపేసిన జైలవకుశ సినిమా మొత్తంగా ఆల్ టైం 7 వ ప్లేస్ ని దక్కించుకుని సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు.

Leave a Comment