ఎన్టీఆర్ ఆ రోల్ చేయడం లేదు…క్లారిటీ వచ్చేసింది!!

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు… ఒకటి తర్వాత ఒకటి మంచి సినిమా లు చేస్తూ అటు అభిమానులను ఇటు సామాన్య ప్రేక్షకుల ను ఆకట్టుకుంటూ వరుస విజయాల తో దూసుకు పోతున్నాడు. జైలవకుశ తో తిరుగు లేని క్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ని త్వరలోనే మొదలు పెట్టనున్నాడు.

కాగా ఈ సినిమా లో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.  కాగా రీసెంట్ గా మొదలైన ఈ సినిమా పూజా కార్యక్రామాలలో విలేఖరులు త్రివిక్రమ్ తో ఇదే విషయాన్ని అడిగారట.

దానికి త్రివిక్రమ్ క్లారిటీ ఇస్తూ ఇందులో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ రోల్ లో కనిపించడం లేదని స్పష్టం చేసినట్లు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటు౦డటం విశేషం అని చెప్పొచ్చు.

Leave a Comment