ఎన్టీఆర్-మహేష్-బాలయ్య…అందరికీ షాక్ ఇస్తూ 300 కోట్లతో సంచలనం

0
220

ప్రతీ ఏడాది సంక్రాంతి ఎంతటి సంచలనం సృష్టించేదో ఈసారి దసరా అలాంటి అద్బుతాలు సృష్టించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. స్టార్ హీరోలు నటించిన సినిమాలు మూడు దసరా బరిలో నిలవడమే దీనికి కారణమని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ జైలవకుశ, మహేష్ స్పైడర్, బాలయ్య పైసావసూల్ ఇలా మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో బాక్స్ ఆఫీస్ కళకళలాడటం ఖాయమని విశ్లేషకులు చెబుతుండగా ఈ మూడు సినిమాల బిజినెస్ కూడా ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది.

కాగా స్పైడర్ 135 కోట్ల బిజినెస్ చేయగా జైలవకుశ కూడా 120 కోట్లవరకు బిజినెస్ చేసినట్లు అంచనా…ఇక బాలయ్య పైసావసూల్ కూడా 45 నుండి 50 కోట్లవరకు బిజినెస్ చేస్తుండటంతో మొత్తం 300 కోట్ల మొత్తంతో మూడు సినిమాలు వస్తున్నాయని అంటున్నారు. మరి అన్నీ విజయం సాధించి పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోస్తాయో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here