ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరు సాధించని ఘనత…ఉత్తమ ||హీరో-విలన్||

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో అందరికీ తెలి సిందే…. హీరో గా ఎన్టీఆర్ కి కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చిన ఈ సినిమా లో ఎన్టీఆర్ హీరో గా మరియు విలన్ గాను నటించి మెప్పించాడు. నేటి తరం హీరోల లో మూడు పాత్రలు చేసిన మొట్టమొదటి హీరోగా నిలిచి సంచలనం సృష్టించాడు.

ఇక ఇందులో నెగటివ్ రోల్ లోను అదరగొట్టిన ఎన్టీఆర్ కి ఇప్పుడు బెస్ట్ హీరో గా మరియు బెస్ట్ విలన్ గా అవార్డ్ దక్కింది…రీసెంట్ గా 91.5 ఎఫ్.ఎం వారు 2017 లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలకు అవార్డులు ఇవ్వగా ఎన్టీఆర్ కి రెండు అవార్డులు ఇచ్చారు.

అందులో ఒకటి బెస్ట్ హీరో కాగా మరోటి బెస్ట్ విలన్ అవార్డ్…రెండు పాత్రలలో ను అదరగొట్టిన ఎన్టీఆర్ ఇలా రెండు అవార్డులు సొంతం చేసుకుని నేటితరం హీరోలలో ఒక సినిమాకి బెస్ట్ హీరో బెస్ట్ విలన్ రెండు అవార్డులు అందుకున్న ఓకే ఒక్క హీరో గా సంచలనం సృష్టించాడు.

Leave a Comment