మళ్ళీ ఎన్టీఆర్ భీభత్సం…రావణుడి దెబ్బకి మరో ఇండస్ట్రీ రికార్డ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జైలవకుశ అఫీషియల్ టీసర్ టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీసర్స్ లలో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తూ ఈ టీసర్ దూసుకుపోతుంది.

కాగా టీసర్ రీసెంట్ గా టాలీవుడ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన టీసర్ గా సంచలనం సృష్టించగా ఇప్పటికీ టీసర్ జోరు తగ్గకపోవడంతో కచ్చితంగా మరిన్ని సంచలన రికార్డులు ఈ టీసర్ సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక త్వరలోనే సినిమాకి సంభందించిన మరో 2 టీసర్లను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట…యంగ్ టైగర్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న భారీ ఎత్తున రిలీజ్ కానుంది…

Leave a Comment