ఇలాంటి సినిమా ఎన్టీఆర్ ఎలా వదులుకున్నాడు అసలు

0
15848

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో..రోజు అనేక కథలు వినే ఎన్టీఆర్ కొన్ని సార్లు మంచి కథలను మిస్ చేసుకున్నాడు. అవి వేరే హీరోల దగ్గరకు వెళ్లి సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయి. ఇలా ఎన్టీఆర్ మిస్ చేసుకున్న కథల జాబితాలో లేటెస్ట్ గా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన జయజానకినాయక కూడా ఒకటని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. బోయపాటి ఎన్టీఆర్ తో దమ్ము చేసే సమయంలో ఈ కథ గురించి చెప్పాడట.

కానీ ఎన్టీఆర్ ఈ కథలో హీరోయిన్ చుట్టూ ఎక్కువ కథ ఉండటం, అంతకుముందే ఊసరవెల్లిలో ఇలా ప్రయోగం చేసి దెబ్బ తినడంతో నో చెప్పి దమ్ముని ఒకే చేశాడట…కానీ ఇప్పుడు జయజానకినాయక చూసినవాళ్ళు ఎన్టీఆర్ కనుక ఆ మాస్ సీన్స్ చేసి ఉంటె ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉండేదని చెప్పుకుంటున్నారు…

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలతో పాటు 80 కోట్ల మార్క్ ని దాటనివ్వగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయజానకినాయక మాత్రం మంచి టాక్ తెచ్చుకున్నా ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోలేక ఓవరాల్ గా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఇదే సినిమా కనుక ఎన్టీఆర్ చేసుంటే సినిమా రేంజ్ కి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసేదని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here