ఏంటి సామి ఇది…ఎన్టీఆర్ ఎం మారలేదు గా…Why

0
525

    గత కొద్ది రోజులు గా జూనియర్ ఎన్టీఆర్ బయట కనిపించకపోవడం పూర్తిగా బరువు తగ్గే పనిలో ఉన్నాడు అని సోషల్ మీడియా లో విపరీత ప్రచారం జరగడంతో త్రివిక్రమ్ సినిమా కోసం బాగా కష్ట పడుతు న్నాడు అనుకున్నారు అందరు. కాని ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించడాని కి వచ్చిన ఎన్టీఆర్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే తారక్ లో ఏ మాత్రం మార్పు లేకపోవడమే.

జై లవకుశ షూటింగ్ టైం లో ఏ లుక్ లో ఉన్నాడో దానిలో ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే కనిపించాడు.  అంటే ఫారిన్ ట్రైనర్ ని పెట్టుకుని జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ బరువు మీద బాగా ఫోకస్ పెడుతున్నాడు అనే వార్తలు బోగస్ అని తేలిపోయింది. మరి త్రివిక్రమ్ సలహా మేరకు తన పాత లుక్ కంటిన్యూ చేస్తున్నాడా……

లేక ఇంకొంచెం టైం తీసుకుని ఫ్రెష్ గా ఏమైనా మొదలు పెడతాడా అర్థం కాక అయోమయంలో ఉన్నారు ఫాన్స్. అజ్ఞాతవాసి రిజల్ట్ తర్వాత త్రివిక్రమ్ ఎక్కడా కనిపించడం లేదు. కెరీర్ లో మొదటిసారిగా తీవ్ర స్థాయిలో విమర్శలు అందుకున్న నేపధ్యంలో దీని గురించే గుచ్చి గుచ్చి అడుగుతారని తెలిసే బయటికి రావడం లేదని తెలిసింది.

తీసికట్టు టేకింగ్ తో పూర్తిగా నిరాశ పరిచారని అతనిపై మాటల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తారక్ తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ ని మరోసారి క్రాస్ చెక్ చేసే పనిలో ఉన్నాడని మరో టాక్ కూడా ఉంది. జై లవకుశ వచ్చాక నాలుగు నెలల నుంచి యంగ్ టైగర్ ఖాళీగా ఉన్నాడు.

మరో నెల దాక త్రివిక్రమ్ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఆ లోపు వెయిట్ లో పూర్తి మేకోవర్ సాధ్యం కాదు కనక ఎన్టీఆర్ తన ఒరిజినల్ లుక్ లోనే త్రివిక్రమ్ సినిమాలో నటించడం కన్ఫర్మ్ అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here