యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ జైలవకుశ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన జై టీసర్ ఆల్ టైం రికార్డులు నెలకొల్పింది.

కాగా ఇప్పుడు రెండో టీసర్ లవ టీసర్ ఈ నెల 27 న సాయంత్రం 5:22 కి రిలీజ్ చేయాలి అని భావించగా ఎన్టీఆర్ షూటింగ్ నిమిత్తం పూనే ఉండటం అక్కడే బిగ్ బాస్ కోసం కూడా కష్టపడుతుండటంతో డేట్ ని పోస్ట్ పోన్ చేశారట..

దాంతో ఈరోజు వస్తుందేమో అని ఆశపడ్డ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమా రెండో టీసర్ ని ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి ఆ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది…

Leave a Comment