ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన జైలవకుశ టీం

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జైలవకుశ సినిమాలోని మూడు పాత్రల తాలూ కు ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వగా జై మరియు లవ టీసర్ లు కూడా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి…వాటిలో జై టీసర్ సంచలన రికార్డులు నమోదు చేయ గా లవ టీసర్ అనుకున్న రేంజ్ లో భీభత్సం సృష్టించడం లో విఫలం అయ్యిందనే చెప్పాలి.

కాగా మూడో పాత్ర అయిన కుశ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి టీసర్ కోసమే ఎదురుచూస్తున్న అభిమానులకు ఎప్పటి కప్పుడు షాక్ ఇస్తూ జైలవకుశ టీం కుశ టీసర్ ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. కాగా సెప్టెంబర్ 5న పక్కాగా టీసర్ వస్తుందని…

అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ మరోసారి పోస్ట్ పోన్ చేసిన జైలవకుశ టీం..ఇప్పుడు టీసర్ డేట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అర్ధం అవ్వడం లేదు…మరో పక్క 10 న ట్రైలర్ రిలీజ్ ఉండటంతో టీసర్ కి ట్రైలర్ కి మధ్య గ్యాప్ తక్కువగా ఉండటం తో రెండింటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది…

Leave a Comment