24 గంటల్లో మహేష్ ఫ్యాన్స్ చేసిన రికార్డ్ పై యంగ్ టైగర్ ఫ్యాన్స్ కన్ను…కొట్టేస్తారా మరి!!

0
2424

దసరా కానుకగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ మహేష్ ల సినిమాలు జైలవకుశ మరియు స్పైడర్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వారం రోజుల తేడాతో రిలీజ్ అవుతున్న విషయం తెలిసినదే…రెండు సినిమాలపై నెలకొన్న అంచనాలు భారీగా ఉండటంతో కచ్చితంగా రెండు సినిమాలు సంచలన రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. రీసెంట్ గా స్పైడర్ ఆడియో వేడుక చెన్నై లో జరిగింది.

ఆ ఆడియో వేడుకలో తెలుగోడి సత్తా టోటల్ తమిళనాడులో వినిపించగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో సునామీ సృష్టించి 24 గంటల్లో 1 లక్షా 23 వేల ట్వీట్స్ తో భీభత్సం సృష్టించారు. కాగా ఇప్పుడు ఒకరోజు తేడాతో ఎన్టీఆర్ జైలవకుశ ఆడియో రిలీజ్ సక్సెస్ మీట్ జరుగుతుంది.

కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ 46 వేల ట్వీట్స్ తో రచ్చ చేయగా రోజు ముగిసే సమయానికి మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here