ఎన్టీఆర్ జైలవకుశ 3 కోట్లు వెనక్కి…నిజమెంత??

0
1559

  GST టాక్స్ ఇంప్లిమెంట్ తర్వాత తెలుగు సినిమాలు టాక్స్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పొచ్చు. అప్పటి వరకు 12 నుండి 14 శాతం కట్టాల్సి ఉండగా తర్వాత ఇప్పుడు ఏకంగా 18 నుండి 28 శాతం టాక్స్ రూపంలో వెళుతుంది. కాగా ఇది భారీగా ఎఫెక్ట్ చూపడం పెద్ద సినిమలకే జరుగుతుంది అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావాలంటే టికెట్ హైక్స్ ఉండాలి…టికెట్ హైక్స్ 100 దాటితే 28 శాతం టాక్స్ వెళుతుంది కాబట్టి కలెక్షన్స్ ఉన్నా టాక్స్ భారీగా కట్టాల్సి ఉంటుంది.

ఇది అన్ని సినిమాల కు ఉండదు. చిన్న సినిమాల టికెట్ రేట్లు 70 80 లోపే ఉన్నా పెద్ద సినిమాలకు అలా ఉంటె ఓపెనింగ్స్ రికార్డ్ లెవల్ లో ఉండవు కాబట్టి హైక్స్ రిలీజ్ చేసి భారీ టాక్స్ ని కట్టాల్సి రావడం ఇప్పుడు టోటల్ గ కలెక్షన్స్ పై ప్రభావం చూపింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ నైజాం ఏరియాలో మొత్తంగా 17.12 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా టోటల్ గ్రాస్ 32 కోట్లకు చేరుకుంది. ఇదే లెక్కన జనతాగ్యారేజ్ కి 19.5 కోట్లకు 30 కోట్ల గ్రాస్ రాగా 3 కోట్ల డిఫెరెంట్ వచ్చింది. కాగా ఈ సినిమాను కొన్న దిల్ రాజు కి ఇప్పుడు 4 కోట్ల మేర నష్టం వస్తుందని తెలిసి కళ్యాణ్ రామ్ 3 కోట్లు వెనక్కి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here