బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ క్రేజ్…ఆ హీరోకి ఎన్టీఆర్ దేవుడు కాబోతున్నాడు

స్టార్ హీరోగా బాలీవుడ్ ని కొన్నేళ్ళు ఏలిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు, చేసిన ప్రతీ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అవ్వలేకపోతుండటంతో షారుఖ్ పై మరింత ప్రెజర్ పెరిగిపోతుండగా ఏ సినిమా చేయాలి అనేది మరింత టెన్షన్ ని కలిగిస్తుంది.

ప్రస్తుతం జబ్ హారీ మీట్ సేజల్ సినిమా తర్వాత మరో సినిమా చేస్తున్న షారుఖ్ కి పక్కా మాస్ మూవీ కావాలాని ఎంత ట్రై చేస్తున్నా దొరకకపోవడంతో అప్పట్లో తెలుగులో 2016 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జనతాగ్యారేజ్ ని రీమేక్ చేయలాని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పుడు మరోసారి ఆ వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ని అక్కడ రీమేక్ చేసే యోచనలో షారుఖ్ ఉన్నట్లు చెబుతున్నారు..అక్కడి కల్చర్ కి సరిగ్గ సూట్ అయ్యే కథ ఈ సినిమా అని అందుకే రీమేక్ చేయలాని షారుఖ్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఎన్టీఆర్ సినిమా షారుఖ్ కి తిరుగులేని క్రేజ్ ని తీసుకురావడం ఖయామని చెప్పొచ్చు.

Leave a Comment