జైలవకుశ 2.66…రంగస్థలం 2.77…ఏం రికార్డ్ సామీ ఇది!!

0
421

  బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి వరుస రికార్డులతో దుమ్ము లేపుతున్న రంగస్థలం సినిమా సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను కొలువుగా మారిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్ర లోనే సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా పక్క రాష్ట్రాలలో కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించి షాక్ ఇచ్చింది. తమిళ్ లో సినిమా సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నెలకొల్పింది అని చెప్పొచ్చు.

అక్కడ తెలుగు సినిమాలలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన సినిమాగా ఎన్టీఆర్ నటించిన జైలవకుశ 2.66 కోట్ల గ్రాస్ తో సెన్సేషన్ క్రియేట్ చేయగా ఆ రికార్డ్ ను రంగస్థలం సినిమా బ్రేక్ చేసి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధించింది.

రంగస్థలం ఇప్పటి వరకు అక్కడ 2.77 కోట్ల గ్రాస్ తో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. డైరెక్ట్ తమిళ్ సినిమాలు లేని కారణంగా రంగస్థలం అక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించి ఇలాంటి హిస్టారికల్ రికార్డ్ కొట్టింది. ఇక రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అనేక రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here