టైగర్ దెబ్బ అంటే ఇదే…షూటింగ్ మొదలు పెట్టారో లేదో కన్నడ దద్దరిల్లింది!!

0
799

  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ముందు నిలిచే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్… సినిమా సినిమా కి అక్కడ తన రేంజ్ ని క్రేజ్ ని పెంచుకుంటూ పోయి జైలవకుశ తో అక్కడ కెరీర్ బెస్ట్ రికార్డ్ ను దక్కించు కున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ అయిన ఎన్టీఆర్ 28 తో రాబోతున్నాడు.

ఫామ్ కోల్పోయి తనని తానూ నిరూపించుకోవాలని చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలు అవ్వగా ఇలా మొదలు పెట్టారో లేదో సినిమా కి కర్ణాటక ఏరియా నుండి అల్టిమేట్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది.

9 నుండి సినిమా 11 కోట్ల రేంజ్ లో అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఇది నిజంగానే ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. బాహుబలి తప్పితే 10 కోట్లకు పైగా బిజినెస్ ని ఏ సినిమా కూడా సాధించలేదు. స్పైడర్ తెలుగు తమిళ్ కలిపి 10 కోట్ల మార్క్ ని అందుకున్నా ఇప్పుడు డైరెక్ట్ తెలుగు తో ఎన్టీఆర్ 28 వ సినిమా అల్టిమేట్ ఆఫర్ ను సొంతం చేసుకొబోతుంది అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here