హీరో కాక ముందు మాట::ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే మొదటి బ్యానర్ నాదే

0
2104

నటుడిగా ఎన్టీఆర్ ని ఇష్టపడని వారు టాలీవుడ్ లో తక్కువే అని చెప్పాలి. సినిమా సినిమా కి వేరియేషన్స్ చూపిస్తూ నటనలో ఎలాంటి వంక పెట్టడానికి చాన్స్ ఇవ్వకుండా మిగిలిన హీరోల కన్నా నటనలో ముందు నిలిచే హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోలలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఓ హీరో మాత్రం సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ సినిమాలకు బ్యానర్స్ కట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు.

ఆ హీరో మరెవరో కాదు…కెరీర్ ని మంచి విజయాలతో స్టార్ట్ చేసి మధ్యలో పూర్తిగా గాడి తప్పి మళ్ళీ ఇప్పుడు ప్రామిసింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న యంగ్ హీరో నాగశౌర్య…. సినిమాల్లోకి రాకముందు నుండి తాను ఎన్టీఆర్ కి వీర ఫ్యాన్ అని చెబుతున్నాడు నాగశౌర్య..

ఎన్టీఆర్ నటించిన అనేక సినిమాలకు థియేటర్ లో ఫస్ట్ బ్యానర్ నేనే కట్టేవాడినని చెబుతున్న నాగశౌర్య తనలో నటనలో ఎలాంటి వంక పెట్టని నటుడిగా ఎదగాలి అనేది తన డ్రీమ్ అని అంటున్నాడు. ఇలా ఫ్యాన్స్ లోనే కాకుండా హీరోలలో కూడా అభిమానులను సంపాదించి ఎన్టీఆర్ కెరీర్ లో మరింత జోరుతో రెచ్చిపోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here